అతి తక్కువ ధరలో టాటా నానో ఎలక్ట్రిక్ కారు రిలీజ్.. అప్పుడే?

దేశం మొత్తంలో ఎలక్ట్రిక్ కార్లతయారీలో నంబర్.1 పొజిషన్‌లో ఉన్న టాటా మోటార్స్ సంస్థ మళ్ళీ తీసుకొస్తుందా అనే సందేహం అందరిలో మొదలైంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్న సమయంలో పరిశ్రమిక వేత్త రతన్ టాటా తన డ్రీమ్ కారుకు ఎలక్ట్రిక్ వర్షన్ తీసుకొచ్చే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదు గల కారు నానో ఈవీ కారును టాటా గ్రూప్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.తాజా మీడియా నివేదికల ప్రకారం టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది.నానో ఈవీ కారుని తిరిగి తీసుకురావాలనుకుంటున్న తరుణంలో, ఫోర్డ్ మరైమలైనగర్ ప్లాంట్ కొనుగోలు గురించి టాటా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు వస్తున్నాయి.2019లో అమ్మకాలు లేకపోవడంతో నానో కార్ తయారీని ఆపేసింది. టాటా మోటార్ సంస్థ దేశంలో అందరికీ కారు అనే నినాదంతో 2008లో కేవలం లక్ష రూపాయలకే నానో కారుని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు అదే నానో కారును ఎలక్ట్రిక్ మోడల్‌లో లాంచ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఈ వార్తలపై కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

టాటా మోటార్ సంస్థ 80% పైగా మార్కెట్ వాటాతో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌ మార్కెట్‌లో లీడర్‌గా ఉంది.ప్రస్తుతం టాటా నెక్సన్, టిగోర్, టియాగో లాంటి ఈవీలను కంపెనీ రిలీజ్ చేసింది.చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

అంతా ఓకే అయితే టాటా కంపెనీ నానోకి వచ్చే ఏడాదిలోగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ తీసుకొచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు