Telugu NRI News Roundup : తెలుగు ఎన్నారై డైలీ న్యూస్ రౌండప్

1.” అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు ”

 అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనం సందర్భంగా న్యూ ఇంగ్లాండ్ ఏరియాలో తానా ఆధ్వర్యంలో ” అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 

2.66.50 కోట్లు గెల్చుకున్న భారత వ్యక్తి

Telugu Abudhabi, America, Balwani, Canada, Iran, Moshen Shekari, England, Nri, N

  అబుదాబి బిగ్ టిక్కెట్ రాఫెల్ లో భారత్ కు చెందిన ఖతార్ హుస్సేన్ 30 మిలియన్ దిర్హంస్  గెలుచుకున్నారు.
 

3.అమెరికాలో ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

  అమెరికాలోని శాం ఫ్రాన్సిస్కో లో బే ఏరియా తెలుగు అసోసియేషన్,  కల వెండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శతాబ్ది గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు కల వెండి సంస్థ సలహాదారు కే ధర్మరావు తెలిపారు.
 

4.భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు శుభవార్త

Telugu Abudhabi, America, Balwani, Canada, Iran, Moshen Shekari, England, Nri, N

  లండన్ లోని భారత హై కమిషన్ కీలక ప్రకటన చేసింది.  బ్రిటన్ ప్రయాణికుల కోసం ఎలక్ట్రానిక్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
 

5.సౌదీ అరేబియా కు చైనా అధ్యక్షుడు

  చైనా అధ్యక్షుడు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఇరుదేశాలు 30 బిలియన్ డాలర్ల విలువచేసే 20 ఒప్పందాలపై సంతకం చేయనున్నాయి.
 

6.పాకిస్తాన్ లో భారీ వరదలు

Telugu Abudhabi, America, Balwani, Canada, Iran, Moshen Shekari, England, Nri, N

  పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.ఈ వరదలు కారణంగా దాదాపు 80 లక్షల మంది నీటిలో చిక్కుకుపోయారని , ఆరు లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయలేదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
 

7.నిరసనకారుడుని ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం

  ఇరాన్ లో భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఓ నిరసనకారుడిని ఉరితీసింది.మోషెన్ షేకారి అనే వ్యక్తిని ఈ రోజు ఉరి తీశారు.
 

8.భారత సంతతి వ్యాపారికి 13 ఏళ్ల జైలు శిక్ష

Telugu Abudhabi, America, Balwani, Canada, Iran, Moshen Shekari, England, Nri, N

  రక్త పరీక్ష పేరుతో ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో భారత సంతతి కి చెందిన బల్వానీ అనే వ్యాపారికి అమెరికా కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
 

9.బహిరంగ మరణ శిక్ష అమలుచేసిన తాలిబన్లు

  ఆఫ్ఘనిస్తాన్ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం తొలిసారిగా బహిరంగ మరణశిక్షను అమలు చేసింది.హత్యా నేరారూపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించడంతో ఫరా ప్రావిన్స్ లో ప్రజలు , అధికారుల మధ్య ఉరి శిక్షను అమలు చేశారు.
 

10.పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్ళిన భారత జావాన్

Telugu Abudhabi, America, Balwani, Canada, Iran, Moshen Shekari, England, Nri, N

  తీవ్రమైన పొగ మంచు కారణంగా దారి కనిపించక పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన భారత్ జవానును పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.భారత్ జవాన్ తిరిగి పంపించాల్సిందిగా భారత సైనిక అధికారులు పాక్ సైన్యాన్ని కోరినా, వారు నిరాకరించారు.గడిచిన వారం రోజుల్లో ఇది రెండో ఘటన.   

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Immigran-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube