Whatsapp Emojis : త్వరలో వాట్సాప్ యూజర్లకు మరిన్ని ఎమోజీలు.. కొందరికి మాత్రమే

ప్రస్తుతం అనేక సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.అయితే వాటన్నింటిలోనూ వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది.

 Soon More Emojis For Whatsapp Users Only For Some ,whatsapp Users Alert, Technol-TeluguStop.com

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడమే దీనిని అగ్రస్థానంలో నిలపుతోంది.తాజాగా వాట్సాప్ ఐఓఎస్ బీటాలో వీడియో కాల్‌ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు రానుంది.

పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను యూజర్ల కోసం తీసుకు రానుంది.iOS 22.24.0.79 అప్‌డేట్‌ చేసుకుని, వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.ఈ విషయాన్ని వాట్సాప్ నుంచి తాజా అప్‌డేట్‌లను తెలిపే వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించుకోవచ్చు.మీరు ఇతర అప్లికేషన్‌లతో మల్టీ టాస్క్ చేసినప్పుడు, మీ ఖాతా కోసం సామర్ధ్యం ప్రారంభించబడితే, పిక్చర్-ఇన్-పిక్చర్ వీక్షణ తక్షణమే కనిపిస్తుంది.

Telugu Emojis, Ups, Whatsapp-Latest News - Telugu

వాట్సాప్ నుంచి వచ్చిన కొత్త అప్‌డేట్‌ల ప్రకారం 21 కొత్త ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి.భవిష్యత్తులో ఈ కొత్త ఎమోజీలు అన్నీ అందరికీ అందుబాటులోకి వస్తాయి.మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ బీటా వెర్షన్‌లో ఇప్పటికే కనిపించే ఎనిమిది ఎమోజీలను రీ డిజైన్ చేసింది.21 కొత్త ఎమోజీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.ఇవే కాకుండా కొన్ని కొత్త ఫీచర్లు ఇటీవల వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.వాటిలో తేదీల వారీగా మెసేజ్‌లను, ఫొటోలను, వీడియోలను చూసే ఫీచర్ ఉంది.అయితే ఈ ఫీచర్ మాత్రం ఐఓఎస్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.డిస్ అప్పియరింగ్ ఫీచర్ కూడా అభివృద్ధి దశలో ఉంది.

మెసేజ్‌ను ఎవరికైతే పంపించామో వారు చూసిన వెంటనే అది డిలీట్ అవుతుంది.ఇదే కాకుండా బిజినెస్ డైరెక్టరీని ఐదు దేశాల్లో వాట్సాప్ ప్రారంభించింది.

ఈ ఫీచర్ బ్రెజిల్, UK, ఇండోనేషియా, మెక్సికో మరియు కొలంబియా అంతటా అందుబాటులోకి వచ్చింది.దీని ద్వారా యూజర్లు కొన్ని కంపెనీల గురించి తెలుసుకోవడానికి, వాటి వ్యాపారాలకు సంబంధించి బ్రౌజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube