నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఈయన వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
తాజాగా ఈయన అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనంతరం అన్ని అంచనాల నడుమ వీర సింహారెడ్డి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ సినిమాకి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ సినిమా సాటిలైట్ హక్కులను అలాగే డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విడుదల కాకుండానే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ప్రముఖ టెలివిజన్ ఛానల్ స్టార్ మా భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని కైవసం చేసుకున్న స్టార్ మా అదే బాటలో వీరసింహారెడ్డి సినిమా రైట్స్ కూడా దక్కించుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికీ అఖండ సినిమా స్టార్ మా లో ప్రసారమైనప్పటికీ అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకోవడంతో బాలయ్య తదుపరి సినిమాని కూడా స్టార్ మా కైవసం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.త్వరలోనే వీటి గురించి అధికారకంగా మేకర్ ప్రకటించనున్నారు
.