Director Bala Suriya : బాల సూర్య ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం అదే.. ఆ డిఫరెన్సెస్ వల్లే ఇదంతా?

దర్శకుడు బాలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చాలామందికి బాలా పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ విషయంలో కాంట్రవర్సీ గుర్తుకు వస్తూ ఉంటుంది.

 Suriya Rejected Director Bala Movie , Suriya, Bala , Kollywood , Director Bala,-TeluguStop.com

బాలా అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ విషయంలో కాంట్రవర్సీకి కారణమైన విషయం మనం అందరికీ తెలిసిందే.తాజాగా తమిళ హీరో సూర్యతో చేస్తున్న సినిమా విషయంలో మరొక వివాదానికి తెర లేపారు దర్శకుడు బాలా.

హీరో సూర్య దర్శకుడు బాలా కాంబినేషన్లో ఇప్పటికే నందా శివపుత్రుడు లాంటి మంచి మంచి సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ మళ్లీ కొత్తగా ఒక సినిమాను మొదలు పెట్టారు.

వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోంది అని ప్రకటించిన తర్వాత చాలా ఏళ్లకే వీరి సినిమా పట్టాలు ఎక్కింది.బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా భారీ అంచనాలతో కన్యాకుమారిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది.

ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ కన్యాకుమారిలో భారీగా సెట్ చేసి షూట్ చేశారు.కానీ ఆ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ వచ్చేసరికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హీరో సూర్య ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు.

అయితే సూర్య ఆ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకున్నాడు అని అభిమానులు ఆందోళనచెందుతుండగా ప్రాజెక్టు నుంచి సూర్య ఎందుకు తప్పుకున్నాడు అన్న విషయాన్ని దర్శకుడు బాలానే బయట పెట్టేశారు.

Telugu Arjun Reddy, Bala, Kollywood, Suriya-Movie

ఈ ప్రాజెక్ట్ నుండి సూర్య తప్పుకున్నప్పటికీ, మరొక హీరో ని తెచ్చి సినిమాని పూర్తి చేస్తామంటూ బాలా ప్రకటించారు.అయితే సూర్య సినిమా నుంచి వెళ్లిపోవడానికి సూర్య బాలా కి మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి.ఇంకొందరు అయితే బాలా కి సూర్యకి మధ్య సెట్ లోనే గొడవ జరిగిందని ఆ కారణంగానే సూర్య సినిమాను వదిలి వెళ్ళిపోయాడు అని ఆరోపించారు.

కొంతమంది ఆ సినిమా కోసం దర్శకుడు లెక్కకు మించి బడ్జెట్ పెట్టడం అన్నది సూర్యకు నచ్చలేదని ఆరోపించారు.అదేవిధంగా ప్రతి ఒకసారి షెడ్యూల్ వాయిదా పడటం వల్ల కూడా విసుగెత్తి సూర్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు అంటూ కూలీవుడ్లు అనేక రకాల వార్తలు జోరుగా వినిపించాయి.

కానీ సూర్య ఎందుకు తప్పిపోయాడు అన్న దానికి అసలు కారణం మాత్రం తెలియలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube