Chief Minister KCR : అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన..మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుఅంబేద్కర్ గారిని అత్యంత గౌరవించే వ్యక్తి కేసిఆర్…వారి ఆశయాలు,ఆలోచనలు భారత దేశంలోనే సంపూర్ణంగా అమలు చేస్తున్నది కేసిఆర్ ప్రభుత్వమేకొత్త సెక్రటేరియట్ కు రాజ్యాంగ నిర్మాత పేరు…హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఈ గొప్ప నిర్మాణాల్లో నాకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్ గారికి ధన్యవాదాలుభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు.

 According To The Ideas Of Ambedkar, Chief Minister Kcr's Rule.. Minister Vemula-TeluguStop.com

బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అని మంత్రి వేముల కొనియాడారు.అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు.ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు.

అంబేద్కర్ గారిని అత్యంత గౌరవించే వ్యక్తి కేసిఆర్ అని అందుకే వారి ఆశయాలు,ఆలోచనలు భారత దేశంలోనే సంపూర్ణంగా అమలు చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఘంటాపథంగా చెబుతున్నాఅన్నారు.ఆ మహనీయుని సేవలను స్మరించుకునే విధంగా కొత్త సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టుకున్నామని,హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గ నిర్దేశనంలో తన పర్యవేక్షణలో ఈ చారిత్రక నిర్మాణాలు జరగడం తన అదృష్టం అన్నారు.ఈ గొప్ప నిర్మాణాల్లో తనకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

అణగారిన వర్గాల అభ్యున్నతికి కేసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు.ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి గారు కూడా అణగారిన వర్గాల ప్రజల కోసం చేయని సంక్షేమ కార్యక్రమాలు నేడు కేసిఆర్ తెలంగాణలో చేస్తున్నారని వెల్లడించారు.

మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పలువురు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube