తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 13 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 14వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే తాజాగా బిగ్ బాస్ 13వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఫైమా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి ఆ వారం సేఫ్ అయింది ఫైమా.దాంతో ఫైమా బదులు రాజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు.
కానీ 13 వ వారం మాత్రం తప్పించుకోలేకపోయింది ఫైమా.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫైమా రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ఇదే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.పేదరికంలో పుట్టి పెరిగిన ఫైమాకు సొంతింటి కల ఉంది అన్న విషయం ఆమె బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అయినా తన తల్లిదండ్రులకు సొంత ఇల్లు కట్టించాలన్నదే తన కళ అని చెప్పుకొచ్చింది ఫైమా.అయితే ఫైమా కల నెరవేరింది అని చెప్పవచ్చు.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఆమె పారితోషికం చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఎందుకంటే ఫైమా బిగ్ బాస్ హౌస్ లో రోజుకి 30 వేల చొప్పున వారానికి 2.1 లక్షలు రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

ఇలా మొత్తం 13 వారాలకు గాను దాదాపుగా 27 లక్షల రెమ్యునరేషన్ గా అందుకుంది అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త విన్న నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.అదొక 27 లక్షలతో పాటు ఇతర గిఫ్టులు అన్నీ కలుపుకొని 30 లక్షలు వరకు ఫైమా పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పైన బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని ఎంత సంపాదించుకుందో కానీ తన సొంత ఇంటి కల నెరవేర్చుకునే అవకాశం తనకు దక్కింది అని చెప్పవచ్చు.ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రేమా విషయానికి వస్తే.మొదట పటాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఫైమా ఆ తర్వాత బాగా పాపులారిటి సంపాదించుకొని జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్లో కలిసి చేయడంతో కొన్ని వారాలపాటు వరుసగా విజేతలుగా నిలిచింది పైమా.







