చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఏనుగుల మంద బీభత్సం సృష్టిస్తుంది.గుడియాత్తం రోడ్డుపై గజరాజులు సంచరిస్తున్నాయి.
సమీప అడవి నుంచి సోలార్ కంచెను దాడి సుమారు 22 ఏనుగులు జనావాసాల్లోకి వచ్చాయి.గజరాజుల రాకతో రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు.