సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈయన త్రివిక్రమ్ తో మూవీ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు కలిసి సినిమాలు చేసారు.
అతడు, ఖలేజా వంటి రెండు సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి.రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ సాధించాయి.
ఇప్పుడు మూడవ సినిమా రాబోతుంది.దీంతో ఫ్యాన్స్ మరింత ఖుషీగా ఉన్నారు.
ఈసారి త్రివిక్రమ్ మహేష్ ను ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా చూపించ బోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.మరి ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం.
ప్రెజెంట్ రెండవ షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో రూమర్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించ బోతున్నారు అనే విషయంపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.
సంజయ్ దత్, విక్కీ కౌశల్ వంటి పేర్లు వినిపించగా ఇప్పుడు మరొకరి పేరు కూడా వినిపిస్తుంది.తాజాగా మహేష్ బాబు కి విలన్ గా ఈ సినిమాలో ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీ ఖాన్ ను తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.అందుకే ఈ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకుంటే ఈయననే ఫిక్స్ చేయాలని చూస్తున్నారట.ఇదే నిజం అయితే బిటౌన్ లో కూడా ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసుకోవడం ఖాయం.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.







