టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ తండ్రి కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.తాజాగా బిగ్ బాస్ షో ప్రోమో రిలీజ్ కాగా బిగ్ బాస్ రేవంత్ భార్య అన్విత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని వెల్లడించారు.
రాత్రి 11 గంటల 51 నిమిషాలకు అన్విత బిడ్డకు జన్మనిచ్చిందని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు.ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
రేవంత్ తండ్రి అయ్యారనే విషయం తెలిసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా సంతోషించడంతో పాటు రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఆ తర్వాత నాగ్ మాట్లాడుతూ బిగ్ బాస్ చరిత్రలో మోస్ట్ బ్యూటిఫుల్ మూవ్ మెంట్ జరగనుందని చెబుతూ రేవంత్ కూతురుకు సంబంధించిన వీడియోను బిగ్ బాస్ ప్లే చేశారు.
రేవంత్ భార్య అన్విత కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
రేవంత్ మాట్లాడుతూ ఇప్పుడు మీ యువరాణి జూనియర్ రేవంత్ అని చెబుతూ కూతురిని పైకి చూపించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం రేవంత్ కూతురికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రేవంత్ కూతురు చాలా క్యూట్ గా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రేవంత్ మాట్లాడుతూ ఈ సమయంలో నేను అక్కడ ఉండాలని అయితే అక్కడ లేనందుకు నన్ను క్షమించాలని చెబుతూ కామెంట్లు చేశారు.

నాని సినిమాలోని పాటను పాడుతూ రేవంత్ నేను ఇక్కడే గెలిచానని చెబుతూ మురిసిపోయారు.ఈ ప్రోమోకు గంటలో ఏకంగా 4 లక్షల వ్యూస్ వచ్చాయి.రేవంత్ బిగ్ బాస్ షోకు విజేతగా కూడా నిలుస్తారని ఇందుకు సంబంధించి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రేవంత్ విజేతగా నిలుస్తారని కచ్చితంగా అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.







