టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి పరిచయం అవసరం లేదు.అల్లు రామలింగయ్య వారసుడిగా గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈయన నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అల్లు అరవింద్ తన బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.సినిమాల విషయంలో అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఎప్పుడూ కూడా తప్పు కాదని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.
ఇలా సినిమాలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి ఈయన తాజాగా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇకపోతే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ కనుక నటిస్తే ఆయనకు మొత్తం రెమ్యూనరేషన్ ఇస్తారా అని బాలయ్య ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా చిరంజీవి అల్లు శిరీష్ మిగతా మెగా హీరోలు ఎవరు నటించినా కూడా వారికి బయట ప్రొడ్యూసర్లు ఇచ్చే రెమ్యూనరేషన్ తాను ఇస్తానని తెలిపారు.
![Telugu Allu Arvind, Alluarjun, Geetha, Sirish, Tollywood-Movie Telugu Allu Arvind, Alluarjun, Geetha, Sirish, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/Tollywood-remuneration.jpg )
ఇలా ఈ హీరోలందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేస్తానని, చివరికి సినిమా విడుదలకు ముందు రోజైనా సరే వారి రెమ్యూనరేషన్ క్లియర్ చేస్తానని అలా చేస్తేనే నాకు నిద్ర పడుతుందనీ తెలిపారు.ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోల రెమ్యూనరేషన్ గురించి అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.