kalvakuntla Kavitha : కవిత కు సీబీఐ నోటీసులు ! అన్ని ఆధారాలు దొరికేశాయా ? 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది.ఒకపక్క తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం జరుగుతోంది .

 Cbi Notices To Kavitha  Have You Found All The Clues , Cbi, Amith Arora, Kalvaku-TeluguStop.com

మరోవైపు కేసీఆర్ బి.ఆర్.ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేఖ కూటమి ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలను తమ వైపుకు తిప్పుకుని మూకమ్మడిగా బిజెపిని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపద్యంలోని కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రముఖంగా వినిపించడం తో ఇదంతా బిజెపి కుట్ర గా టిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది .అయితే తాజాగా కవితకు ఈ వ్యవహారంలో సిబిఐ నోటీసులు జారీ చేసింది.160 సిఆర్పిసి కింద విచారణకు సహకరించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
  ఈ మేరకు సిబిఐ డిఎస్పి అలోక్ కుమార్ షహీ కవితకు నిన్ననే నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి , ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు , మరో 14 మందిపై ఐపిసి సెక్షన్ 477 ఏ కేసు నమోదు అయినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు.అంతేకాకుండా ఈ వ్యవహారంలో కవితకు సంబంధించిన అనేక ఆధారాలు ఈ లిక్కర్ స్కాం లో ఉన్నట్లుగా తేలినట్లు సిబిఐ పేర్కొంది.

దీనిపై మరింత లోతుగా కవితను ప్రశ్నించేందుకు ఈనెల ఆరో తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా విచారణకు హాజరు కావచ్చు అని సిబిఐ నోటీసుల్లో పేర్కొంది.అయితే ఈ వ్యవహారం పై కవిత కూడా స్పందించారు.

తాను తన నివాసంలోనే ఆరో తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని ఆమె వెల్లడించారు.ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఉన్న వారంతా ప్రముఖులు కావడంతో , ఈ స్కాం కు సంబంధించిన అన్ని ఆధారాలను పక్కాగా రెడీ చేసుకుని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 

Telugu Aam Adhmi, Amith Arora, Cbi, Sarathchandra, Vijay Nayar-Political

ముఖ్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడు విజయ్ నాయర్,  అలాగే పార్టీకి చెందిన అమిత్ ఆరోరాను ఇప్పటికే ఈడి అధికారులు అరెస్ట్ చేశారు.సిబిఐ స్పెషల్ కోర్ట్ ముందు హాజరు పరిచారు.ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును అధికారులు చేర్చారు.సౌత్ గ్రూప్ 100 కోట్లు చెల్లించిందని, సౌత్ గ్రూప్ ను శరత్ చంద్ర రెడ్డి,  కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి నియంత్రించారని సిబిఐ పేర్కొంది.

సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను ఆప్ నేత అమిత్ అరోరా తన స్టేట్మెంట్ లో ఈ విషయాలను ధ్రువీకరించినట్లుగా ఈడి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube