జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ సందడి కొనసాగుతుండగా లేటెస్ట్ గా రష్యాలో పుష్ప రాజ్ వాలిపోయాడు.పుష్ప ది రైజ్ మూవీని రష్యాలో గ్రాండ్ రిలీజ్ చేశారు.
అక్కడ భాషలో సినిమా వసుండటంతో ఆడియన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.ఇప్పటికే పుష్ప రష్యన్ భాష ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ వీరంతా రష్యాలో సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లారు.ఇక ఈ ప్రమోషన్స్ లో రష్యాలో సామీ సామీ సాంగ్ వైరల్ గా మారింది.

అక్కడ ఎక్కడ చూసినా సరే సామీ సామీ సాంగ్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.రష్యాలో రోడ్ల మీద కూడా సామీ సామీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నారట.పుష్ప మూవీ రష్యా ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది.పుష్ప రికార్డుల్లో రష్యా వసూళ్లు కూడా యాడ్ అవనున్నాయి.రష్యన్ వీధుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అతనితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఏది ఏమైనా తెలుగు హీరోలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఆనందించదగ్గ విషయమే.
జపాన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ రష్యాలో అల్లు అర్జున్ ఇలా మన స్టార్స్ వరల్డ్ వైడ్ పాపులర్ అవడం తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది.







