Jaggery Milk : పాలు, బెల్లం కలిపి తాగితే కలిగే ప్రయోజనాలెంటో మీకు తెలుసా?

పాలు అంటే ఎంతటి ఘనత ఉందో మనందరికీ తెలిసిందే.పాలలో ఉన్న కాల్షియం కారణంగా పాలను చాలామంది దివ్య ఔషధంగా భావించి తీసుకుంటూ ఉంటారు.

 Do You Know The Benefits Of Drinking Milk And Jaggery Together , Milk , Jaggery-TeluguStop.com

ముఖ్యంగా పిల్లలకు అవసరమైనది ఏదైనా ఉందంటే అది పాలు మాత్రమే.అందుకే చిన్నపిల్లలకు వాళ్లు తాగకపోయినా బలవంతంగా తల్లిదండ్రులు పాలు తాగిపిస్తూ ఉంటారు.

అయితే పాలు సంపూర్ణ ఆహారం అని అంటారు.అయితే చాలామందికి చక్కెర కలిపిన పాలు తాగడం అంటే ఇష్టం.కానీ కొంతమంది సాధారణ పాలు తాగడానికి ఇష్టపడతారు.కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం సాధారణ పాలను తాగడం వల్ల మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

అయితే తీపి పాలను తాగడం వల్ల శరీరానికి మరింత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే పాలను తీయగా మార్చడానికి చక్కెర కలిపితే అది హానికరంగా మారుతుంది.

అందుకే చక్కెరకు బదులుగా బెల్లం వాడితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే బలహీనంగా అనిపిస్తే పాలలో బెల్లం కలుపుకుని తాగితే చాలా మంచిది.ఎందుకంటే ఇందులో ఉండే క్యాల్షియం శరీరానికి బలహీనత ను దూరం చేస్తాయి.

పాలు, బెల్లం చెడు జీర్ణ క్రియకు సజావుగా సాగే లాగా చేస్తాయి.పాలను ఈ విధంగా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

Telugu Benefits Milk, Tips, Jaggery, Milk-Telugu Health Tips

అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.ఒక గ్లాసు పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్దకం లాంటి అనేక కడుపు సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.ఆ సమయంలో బెల్లం పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇందులో ఉండే విటమిన్ ఏ, డి, జింక్, ఐరన్, సెలీనియం లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.అలాగే చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టకపోవడం లాంటి సమస్య ఉంటే పాలలో బెల్లం కలుపుకుని తాగితే మంచి నిద్ర వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube