Begger House : అతడు అడుక్కొనేవాడు, అయితేనేం.. 5 కోట్ల విలువచేసే ఇల్లు వుంది!

అవును, మీరు విన్నది నిజమే.అతగాడు ఓ యాచకుడు.

 He Is A Beggar, But He Has A House Worth 5 Crores , Begger, Viral Latest, News V-TeluguStop.com

అయితేనేం, 5 కోట్ల విలువచేసే ఇల్లు వుంది అతనికి.మనమెంత కష్టపడినా అంత విలువ చేసే ఇల్లు కట్టడం అసంభవం కదా.సాధారణంగా మనం రోజూ చూస్తూ ఉంటాం.రోడ్ల కూడలిలో ఎంతోమంది బిచ్చగాళ్ళు యాచిస్తూ వుంటారు.

చాలామంది వీరిని చూసి అసహ్యించుకుంటూ వుంటారు.అవయవాలు సరిగ్గా లేనివారు అయితే ఓకే గాని… అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్న వారిని చూసి అనేకమంది చిరాకు పడుతూ వుంటారు.

ఇంకా చెప్పాలంటే, వారిని కొంతమంది ఎందుకూ కొరగానివారిలా చూస్తూ వుంటారు.ఇక కొంతమంది వారి ధీనావస్థను చూసి ఎంతోకొంత ఇస్తూ వుంటారు.అలా వచ్చిన డబ్బుతో వారు కడుపు నింపుకోవడానికే కష్టం పడతారు అని అనేకమంది పొరబడతారు.అయితే యాచకులు దగ్గరే బోలెడంత సంపాదన ఉంటుందని మనం అనేక పత్రికలలో ఇప్పటికే చదివి వున్నాం.

అయితే ఇక్కడ చెప్పుకోబోయేది వారిని మించిన ఓ ధనవంతుడైన యాచకుడు.అవును, బిచ్చంగా వచ్చిన డబ్బుతో ఏకంగా 5 కోట్ల విలువ చేసే ఇల్లు కొన్నాడంటే నమ్ముతారా?

Telugu Begger, London, Latest-Latest News - Telugu

మీరు విన్నది నిజమే.లండన్ కు చెందిన డామ్ అనే యాచకుడు బిచ్చం ద్వారా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా పోగేసి ఏకంగా రూ.5 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడు.ఓ మీడియా వేదికగా అతగాడు మాట్లాడుతూ తన వృత్తాంతాన్ని చెప్పుకొచ్చాడు.అతడు తన చిన్నతనం నుంచే డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిస అయ్యాడయ్యాడట.దాంతో అందరూ అతనిని దూరం పెట్టేవారట.ఈ క్రమంలో కొంతమంది అధికారులు అతనిని రీహాబ్ సెంటర్‎కి తరలించారట.

అలా 7 ఏండ్ల పాటు రీహాబ్ సెంటర్‎లోనే ఉండి బయటకు వచ్చిన తర్వాత సాధారణ జీవితం గడపాలని డ్రగ్స్ కి దూరంగా వున్నాడట.అయితే బిచ్చమెత్తుకోవడం ఆపలేదట.

అలా వచ్చిన ఆదాయంతో తన కొడుక్కి ఏకంగా 5 కోట్ల విలువచేసే ఇల్లు కొన్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube