తిరుపతి జిల్లా చంద్రగిరిరెడ్డివారిపల్లెలో పరువు హత్య జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థి మోహనకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మోహన కృష్ణను గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని సమాచారం.ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పలువురు భావిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.







