రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్న చిన్నారి రిత్విక్ గౌడ్ గా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







