అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా వివిధ భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా త్వరలోనే రష్యాలో విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే చిత్రబృతం మొత్తం రష్యా చేరుకొని పెద్ద ఎత్తున రష్యాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే రష్యాలో ఈ సినిమా విడుదలకు ముందే మంచి ఆదరణ వస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాలో డైలాగులు మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ముఖ్యంగా ఈ సినిమాలో సామీ సామి అనే పాట ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే ఈ పాట కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా రష్యాలో కూడా అందరిని ఓ ఊపు ఊపేస్తుందని చెప్పాలి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యాలో చిత్ర బృందం మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లోని స్టేట్ హిస్టోరియల్ మ్యూజియం ముందు మహిళల బృందం హిట్ పాటకు డాన్సులు చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్యాలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదని తెలుస్తుంది.ఇక ఈ సినిమా రష్యాలో డిసెంబర్ 8వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సైతం మాస్కోలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా రష్యాలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.







