భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు.ఈ నెల 4, 5 వ తేదీల్లో ఆమె పర్యటన ఉండనుందని సమాచారం.
పర్యటనలో భాగంగా విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించే నేవీ డే వేడుకలతో పాటు పలు కార్యక్రమాలకు ఆమె హాజరుకానున్నారు.నేవీ డే వేడుకలలో భాగంగా భారత నౌకాదళం కార్యాచరణ ప్రదర్శనను వీక్షించనున్నారు.
రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభిస్తారు.
అనంతరం కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్ డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ముర్ము ప్రారంభించనున్నారు.
అదేవిధంగా పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముర్ము తొలిసారిగా ఏపీకి రానున్నారు.







