తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏడాది నుంచి తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.
కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని గుత్తా విమర్శించారు.
పాదయాత్ర పేరుతో దత్తపుత్రిక షర్మిల కేసీఆర్ ను అప్రతిష్టపాలు చేస్తోందని వ్యాఖ్యనించారు.







