హైదరాబాద్ నాగోల్ గోల్డ్ షాప్ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కాల్పుల్లో గాయపడిన కల్యాణ్ చౌదరి, సుఖ్ దేవ్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆస్పత్రికి చేరుకున్నారు.బాధితులను పరామర్శించిన అనంతరం కాల్పుల ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు 15 పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.
సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.







