Tollywood heroes : థియేటర్ల విషయంలో హీరోల ఇన్వాల్వ్‌మెంట్‌ అవసరమా?

ఒకప్పుడుహీరో లు కేవలం సినిమాల్లో నటించి వెళ్లి పోయే వారు.ఆ సినిమాల యొక్క విడుదల బాధ్యత పూర్తిగా నిర్మాతదే.

 Tollywood Star Heroes Fighting For Theaters , Tollywood , Heroes, Theaters , P-TeluguStop.com

సినిమా ప్రమోషన్ కి కొన్ని రోజుల పాటు హాజరు అయ్యి ఆ తర్వాత సినిమా కు సంబంధించిన విషయాలన్నింటిని కూడా నిర్మాతలకు వదిలి పెట్టేవారు.కానీ ఇప్పుడు హీరో లు సినిమా విడుదల సమయం లో ఫ్రీ రిలీజ్ బిజినెస్మొదలుకొని థియేటర్ల కేటాయింపు.

ఏ థియేటర్ లలో సినిమా విడుదల అవ్వాలి అనే విషయాల వరకు అన్ని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు.ప్రతి ఒక్క హీరో కూడా తనకు అన్ని థియేటర్లు కావాలి ఇన్ని థియేటర్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారట.

సంక్రాంతి కి రాబోతున్న సినిమా ల హీరో లు కూడా థియేటర్ల విషయం లో నిర్మాతలతో మరియు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

రెండు సినిమాలకు కూడా ఒకే నిర్మాత అవ్వడం తో థియేటర్ల విషయం లో స్వయంగా హీరో లు రంగం లోకి దిగారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇద్దరు హీరోలు కూడా మెజార్టీ థియేటర్ల కోసం తమకు ఉన్న పరిచయాల ద్వారా థియేటర్ల ను బుక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.టాలీవుడ్ లో ఈ పద్ధతి చాలా కొత్తగా ఉందని హీరో లు థియేటర్లను బుక్ చేసుకోవడం ఏంటో అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Producers, Sankarnathi, Heroes, Telugu, Tollywood-Movie

హీరో లు హీరో ల తీరుగానే ఉండాలి తప్పితే డిస్ట్రిబ్యూటర్ల తరహా లోఇలా థియేటర్ ల గురించి ఆలోచించి అనవసరంగా ఈ విషయాన్ని రాద్దాంతం చేయకూడదని.నిర్మాతలు పూర్తి ఆలోచనతో తమకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంచి థియేటర్ల ను తీసుకుంటారని హీరోలు నటించడం మరియు సినిమా ప్రమోషన్ విషయాల్లో దృష్టి పెడితే బాగుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube