Pawan Kalyan Akira Nandan : గడ్డం మీసం లుక్ లో అకీరా నందన్.. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ హంగామా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి మనందరికీ తెలిసిందే.పవర్ స్టార్ అభిమానులు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 Pawan Kalyan Son Akira Nandan Latest Look With Beard Renu Desai Shares Video Aad-TeluguStop.com

అయితే అకీరా నందన్ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ విషయంలో ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే అకీరా నందన్ సినీ ఇండస్ట్రీపై పలుసార్లు రేణు దేశాయ్ స్పందించగా కొన్నిసార్లు ఆధ్య స్పందించింది.

అకీరా నందన్ ఏం అనుకుంటున్నాడో అదే చేస్తాడు.

అయితే అకీరా కూ సంగీతం అంటే ఇష్టం, ఫుట్ బాల్ ఆడటం అంటే ఇష్టం, చదువుకోవడం ఇష్టం అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

అయితే అకీరా నందన్ ఏమవుతాడు అన్న విషయం పై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.కాగా అకిరా నందన్ ప్రస్తుతం స్కాట్లాండ్‌లో చదువుల నిమిత్తం వెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే ఆ మధ్య అకీరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు స్కాట్లాండ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అకీరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు సందడి చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అకిరా నందన్‌ తాజాగా బియర్డ్ లుక్కులో కనిపించాడు.గుబురు గడ్డంతో అకిరా నందన్ కనిపించడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అకిరా నందన్ లుక్కు మీద ఇలా కామెంట్లు వస్తాయనే ఉద్దేశ్యంతోనే రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాంలో కామెంట్ల సెక్షన్‌ను డిసబుల్ చేసింది.దీంతో నెటిజన్లు ఎవ్వరూ కూడా కామెంట్లు పెట్టేందుకు వీల్లేకుండా పోయింది.అయితే ఆ వీడియాలో అకిరా నందన్ తన లుక్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు.మంకీ క్యాప్ ఉన్న షర్ట్ వేసుకోవడంతో అకిరా నందన్ లుక్ సరిగా కనిపించలేదు.

అదే కాస్త నిరాశ పర్చే అంశం.కానీ మీసం, గడ్డం ఉందని మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది.

దీంతో అకిరా నందన్ ఈ కొత్త లుక్ చూసి పవన్ కళ్యాణ్‌ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఆ ఫోటో వీడియోలను చూసిన పవర్ స్టార్ అభిమానులు జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube