తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో బాలకృష్ణ కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది.వీరిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇలా ఇద్దరికీ విడివిడిగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ క్రమంలోనే వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని వీరిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమా చేస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఆశ పడుతుంటారు.
అయితే బాలకృష్ణ చిరంజీవి మల్టీస్టారర్ సినిమా చేయాలని గతంలో కొందరు దర్శకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
గతంలో కోదండరామిరెడ్డి రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్లు వీరిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రయత్నాలు అక్కడికే ఆగిపోయాయి.
ప్రస్తుతమున్న పరిస్థితులలో వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ రావడం అసాధ్యమని తెలుస్తోంది.అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా సురేష్ బాబు అల్లు అరవింద్ వంటి నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మనిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ అల్లు అరవింద్ ను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ.మీరు చిరంజీవి కాంబినేషన్లో సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ అల్లు అరవింద్ షాకింగ్ సమాధానం చెప్పారు.ఇలా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తే అది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది అంటూ బాలయ్యచేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందా అంటూ నందమూరి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.