Adivi Sesh : తెలిసీ తెలియని వయసులో ఆ తప్పు చేశాను.. అడివి శేష్ కామెంట్స్ వైరల్!

అడివి శేష్ నటించిన హిట్2 మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.అడివి శేష్ గత సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో హిట్2 సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే హిట్2 సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Adivi Sesh Shocking Comments Goes Viral In Social Media Details Here , Adivi Se-TeluguStop.com

సొంతం మూవీ చేసిన సమయంలో నా వయస్సు 15 సంవత్సరాలు అని అడివి శేష్ తెలిపారు.ఆ మూవీలో నటించే సమయానికి నాకు గడ్డం కూడా లేదని ఆ మూవీ విషయంలో నేను మోసపోయానని అడివి శేష్ పేర్కొన్నారు.

అమ్మ వాడే కాటుకను గడ్డంలా పెట్టుకుని బిల్డప్ కొట్టేవాడినని అడివి శేష్ వెల్లడించారు.ఆ సమయంలో సొంతం మూవీలో ఆఫర్ వచ్చిందని శేష్ తెలిపారు. సొంతం మూవీలో నలుగురు హీరోలు ఉంటారని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారని శేష్ అన్నారు.

షూటింగ్ కు వెళితే మూడు రోజులు షూట్ చేసిన తర్వాత ప్యాకప్ చెప్పి దర్శకుడు వెళ్లిపొమ్మన్నారని అడివి శేష్ వెల్లడించారు.

తెలిసీ తెలియని వయస్సులో నేను చేసిన తప్పు సొంతం మూవీ అని అడివి శేష్ చెప్పుకొచ్చారు. రిచా పెట్టిన ట్వీట్ నన్ను ఎంతగానో బాధ పెట్టిందని అడివి శేష్ కామెంట్లు చేశారు.

కెరీర్, వ్యక్తిగత జీవితంకు సంబంధించి డిఫరెన్స్ లేకుండా పనులు చేస్తున్నానని అడివి శేష్ చెప్పుకొచ్చారు.

Telugu Adivi Sesh, Sontam-Movie

ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తెలిసిన సమయంలోనే పెళ్లి చేసుకుంటానని అడివి శేష్ తెలిపారు.ప్రస్తుతం సినిమాలపైనే నా దృష్టి ఉందని ఆయన పేర్కొన్నారు.అడివి శేష్ హిట్2 తో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube