Nani Hit 2 : హిట్ 2 లో నాని నటించిన పోవడానికి ఇదే కారణం.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్, రుహాని శర్మ జంటగా నటించిన చిత్రం హిట్.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా హిట్ 2 సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ బ్యానరప్‌ పై నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నిజానికి ఈ సినిమాలో హీరోగా నానితో చేయాలని భావించి కథ ఆయనకు వినిపించడానికి వెళ్లాను.

Advertisement

కథ మొత్తం విన్నటువంటి నాని ఈ సినిమాలో తాను హీరోగా చేయను కానీ నిర్మాతగా చేస్తానని ఈ సినిమాని తానే నిర్మిస్తానని చెప్పారు.అందుకే ఈ సినిమాలో నాని హీరోగా చేయలేకపోయారని అయితే తప్పనిసరిగా నానితో తను సినిమా చేస్తానని ఈ సందర్భంగా హిట్ సినిమాలో నాని చేయకపోవడానికి కారణం వెల్లడించారు.

ఇకపోతే హిట్ సినిమాలో విశ్వక్ నటించారు.అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రం క్లైమాక్స్ రాస్తున్న సమయంలో ఈ సినిమాలో విశ్వక్ కన్నా అడవి శేష్ అయితే బాగుండేది అనిపించింది అందుకే ఈ సినిమాలో అడివి శేష్ ను హీరోగా తీసుకున్నామని తెలిపారు.ఇకపోతే హిట్ 3 కూడా ఉండబోతుందని అందులో హీరో ఎవరు ఏంటి అనే విషయాన్ని తాను ఇంకా అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా శైలేష్ హిట్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు