ఏపీ విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు.
ఫీజు రియింబర్మెంట్స్ పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు.పేదలకు చదువును హక్కుగా మార్చామన్న జగన్ చదువుతోనే పేదరికం పోతుందని తెలిపారు.గత ప్రభుత్వ హయంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు.
విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద రూ.12,401 కోట్లు అందించామని సీఎం జగన్ తెలిపారు.జులై -సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నట్టు వెల్లడించారు.మూడున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు.ఇప్పటివరకు సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.







