ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన క్రాక్ బ్యూటీ శృతి హాసన్ కెరీర్ మధ్యలో కొంత కాలం అవకాశాలు లేక తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంది.అయితే వకీల్ సాబ్, క్రాక్ వంటి సూపర్ హిట్లు అందుకుని మళ్ళీ ఈ బ్యూటీ దూకుడు పెంచింది.
క్రాక్ హిట్ తర్వాత శృతి హాసన్ కు పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.
ఈ సినిమా లో శృతి హాసన్ కు ఆఫర్ రావడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.అయితే ఒకపక్క ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తూనే మరో పక్క టాలీవుడ్ లో ఇద్దరు సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఓకే చెప్పింది.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో శృతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అలాగే మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈ భామనే హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కాబోతున్నాయి.సంక్రాంతి బరిలో నువ్వా నేనా అనే విధంగా చిరు, బాలయ్య తలపడడానికి సిద్ధం అవుతుండగా ఈ రెండు సినిమాల్లోనూ నటిస్తున్న శృతి ఏ హీరోకు పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ మధ్య స్పెషల్ టాక్ నడుస్తుంది.

ఈ రెండు సినిమాల్లో శృతి 30 ప్లస్ లా కనిపించ బోతుంది అని టాక్.మరి ఈ ఇద్దరిలో ఎవరికీ బెస్ట్ అనేది సినిమాలు రిలీజ్ అయితే కానీ చెప్పలేం.తాజాగా వాల్తేరు వీరయ్య నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి రోల్ కు కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది అని అంటున్నారు.మరి ఈమె నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి.
దీంతో ప్రొమోషన్స్ సమయంలో కూడా ఈమెకు ఇబ్బందులు తప్పవు.చూడాలి చిరు వర్సెస్ బాలయ్య లో ఎవరికీ ఈమె పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో.







