Top 10 Scooters : జనాలు బాగా ఇష్టపడుతున్న Top 10 స్కూటర్ల లిస్ట్ ఇదే!

ట్రెండ్ మారింది.ఒకప్పుడు యువకులు ఎక్కువగా బైక్స్ కొనడానికి మొగ్గు చూపేవారు.

 This Is The List Of Top 10 Scooters That People Like Very Much-TeluguStop.com

అయితే నేడు పరిస్థితి మారింది.అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని మగాళ్లు కూడా మహిళలు ఇష్టపడే స్కూటర్లపై మనసు పారేసుకుంటున్నారు.ఇంకేముంది… నేడు బైక్స్ సంఖ్య కంటే స్కూటర్ల సంఖ్యే ఎక్కువగా వుంది.ఇక మీరు కూడా స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఏ స్కూటర్ కొనాలో తెలుసుకొని మరీ కొనండి.ఇపుడు దేశంలో ఎక్కువ మంది ఏ ఏ స్కూటర్లు కొంటున్నారో తెలుసుకొని వీటిల్లో మీకు నచ్చిన స్కూటర్ ఎప్పిక చేస్కోండి.

ఈ అక్టోబర్ నెలలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల గురించి ఓ లిస్ట్ వచ్చింది.

దానిగురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.వీటిల్లో ఎక్కువగా హోండా, టీవీఎస్, యమహా, సుజుకీ కంపెనీల వెహికల్స్ ఎక్కువగా వున్నాయి.

అన్నింటికంటే ఇక్కడ హోండా యాక్టివా టాప్ స్థానంలో వెలుగొందుతోంది.దాంతో ఇది అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది.

చాలా కాలం నుంచి హోండా యాక్టివానే టాప్ సెల్లింగ్ స్కూటర్‌గా కొనసాగుతూ ఉండటం కొసమెరుపు.నేడు యాక్టివా అమ్మకాలు ఏకంగా 2,10,623 యూనిట్లుగా ఉన్నాయి.

Telugu Honda, Honda Activa, Suzuki, Ups, Top Scotters, Tvs Jupiter, Yamaha-Lates

దీని తరువాత ‘టీవీఎస్ జుపిటర్‘ రెండో స్థానంలో ఉంది.దీని అమ్మకాలు అయితే 77,042 యూనిట్లు ఉన్నాయి.ఇక మూడవ స్థానంలో ‘సుజుకీ యాక్సెస్‘ వుంది.దీని అమ్మకాలు 49,192 యూనిట్లు ఉన్నాయి.తర్వాత నాలుగో స్థానంలో టీవీఎస్ ఎన్‌టార్క్ బాగా అమ్ముడవుతోంది.తరువాత ఐదో స్థానంలో ‘హోండా డియో’, ఆరో స్థానంలో ‘హీరో ప్లీజర్’, తర్వాతి స్థానంలో ‘హీరో డెస్టినీ’ నలిచింది.

ఆ తర్వాత సుజుకీ బర్గ్‌మాన్, ఆ తర్వాత ‘యమహా రేజెడ్ఆర్’ ఉంది.ఇక చివరగా పదో స్థానంలో యమహ ఫాసినో ఉంది.

ఇంకెందుకాలస్యం మీకు నచ్చింది ఎంపిక చేసుకోండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube