ప.గో.జిల్లా….పాలకొల్లులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికలలో జగన్ ,పవన్ కళ్యాణ్ లు ఎవరు అధికారం లోకి వస్తారో అన్న అంశం పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా విశ్లేషణ చేశారు వైసిపిని అత్యంత అవినీతి పార్టీగా పెర్కొన్న ఆయన 2024 లో మళ్లీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారుముఖ్యమంత్రి జగన్,ఆయన తాత రాజారెడ్డి,తండ్రి రాజశేఖరరెడ్డి ల అవనీతిలు అనేకం ఉన్నాయని వారి అవనీతి చిట్టాకు గతం లో తానే సాక్ష్యం అన్నారు.
బైరటీస్ ఘనుల అక్రమాలలో గనుల శాఖామంత్రి గా కోటి రూపాయిలు జరిమానా విధించానని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్ ను అభినవ నిత్య అవనీతి పరుడుగా అభివర్ణించ వచ్చునని పేర్కొన్నారు రాష్ట్రం లో కాపు ల సంఖ్య పరంగా ఎక్కువ మంది ఉన్నా రెడ్ల సామాజిక వర్గానికే పదవులు కట్టబెడుతున్నారన్న ఆయన పవన్ కళ్యాణ్ కు అన్ని వర్గాలలో ఆదరణ కాపు సామాజికవర్గ సపోర్ట్ తో ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం.అన్నారు
.