Mahesh Babu Superstar Krishna : నాన్నకు ప్రేమతో మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబును తండ్రి మరణం ఎంతో బాధ పెట్టగా ఆ బాధ నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ కు ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణ కారణమని చెప్పవచ్చు.

 Mahesh Babu Senstional Decision For His Father Details Here Goes Viral, Mahes-TeluguStop.com

అయితే తాజాగా మహేష్ బాబు మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ సంచలన నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.సూపర్ స్టార్ పేరుతో అవార్డులు ఇవ్వాలని మహేష్ భావిస్తున్నారని బోగట్టా.

అయితే ఇందుకు సంబంధించి మహేష్ బాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.నాన్నపేరు నిలిచిపోవాలనే ఆలోచనతో మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ అవార్డులను సినీ రంగంలో ప్రతిభ ఉన్న నటీనటులు, టెక్నీషియన్లకు ఇవ్వాలని మహేష్ బాబు భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

మహేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ గా కామెంట్లు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

అయితే ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రతిభ ఆధారంగా ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

రాజమౌళి ఎక్కడికి వెళ్లినా మహేష్ సినిమా గురించి మాట్లాడుతున్నారు.

Telugu Mahesh Babu, Maheshbabu, Rajamouli, Awards, Krishna-Movie

మహేష్ బాబుకు కూడా భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చే దిశగా జక్కన్న అడుగులు వేస్తున్నారు.జక్కన్న, మహేష్ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లను తీసుకుంటున్నారు.వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా షూట్ మొదలుకానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మహేష్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube