Adivi sesh hit 2 : రాజమౌళి గారికి నేను ఏకలవ్య శిష్యుడిని.. అడివి శేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హెట్2.ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Adivi Sesh Shocking Comments On Rajamouli Details Inside Adivi Sesh, Tollywood,-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరు కావడంతో ఈ కార్యక్రమం మరింత స్పెషల్ గా మారింది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ అని చెప్పే బదులు కుటుంబ సభ్యులని చెబుతాను వీరందరూ కూడా నా కెరియర్ ప్రారంభం నుంచి నాకు ఎన్నో నేర్పి ఎంతో ప్రోత్సహించిన వారని ఈయన తెలిపారు.

హీరో నానికి పెద్ద అభిమానిని ఈ విషయాన్ని తాను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చానని శేష్ వెల్లడించారు.ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి గారికి తాను ఏకలవ్య శిష్యుడిని అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Adivi Sesh, Bahubali, Nani, Rajamouli, Rana, Tollywood-Movie

రాజమౌళి గారి నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మనం ఎంత ఎదిగిన ఎప్పటికీ ఒదిగే ఉండడమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అనేది తాను రాజమౌళి గారిని చూసి నేర్చుకున్నానని శేష్ వెల్లడించారు.ఇకపోతే బాహుబలి సినిమా షూటింగ్ జరిగే సమయంలో తాను వందరోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నారని అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రానా విగ్రహం నిలబెడుతున్న సమయంలో రాజమౌళి గారు రమాతో మాట్లాడుతూ ఈ సినిమా ఆడుతుంది అంటావా అని సందేహం వ్యక్తం చేశారు.ఆ మాటలు విన్న నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని శేషు వెల్లడించారు.ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన రాజమౌళి గారు ఇలా మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపోయానని ఈ సందర్భంగా రాజమౌళి గురించి శేష్ మాట్లాడిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube