టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా,నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన కమెడియన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు.
అనంతరం కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం ఈయన ఎలాంటి సినిమాలను నిర్మించడం లేదని చెప్పాలి.ఇలా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే 2018 సంవత్సరంలో ఈయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ పాలిటిక్స్ లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.
అయితే ఈ మధ్యకాలంలో రాజకీయాలకు కూడా ఈయన దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే బండ్ల గణేష్ ఏదైనా కార్యక్రమంలో భాగంగా మైకు చేత పట్టి మాట్లాడితే పెద్ద ఎత్తున సంచలనం చెలరేగుతుంది.
అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తుంటాయి.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాజకీయాల గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.రాజకీయాల వల్ల జీవితంలో నేను చాలా నష్టపోయాను.తనకు ఏ రాజకీయాలతోనూ, రాజకీయ పార్టీలతోనూ ఏమాత్రం సంబంధం లేదని, అందరూ తనకు ఆత్మీయులేనని ఈ సందర్భంగా బండ్ల గణేష్ రాజకీయాల గురించి ట్విట్టర్ వేదికగా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఉన్నఫలంగా బండ్ల గణేష్ రాజకీయాల గురించి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.







