ప్రెజెంట్ మన టాలీవుడ్ లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏది అంటే అది ‘హిట్ 2’ అనే చెప్పాలి.విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో హిట్ 2 తో మరోసారి ఆకట్టు కునేందుకు రెడీ అయ్యారు.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 1 ను తెరకెక్కించాడు.ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.క్షణం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ అంటే అందరికి తెలిసింది.
ఈయన సినిమా అంటే ఏదొక స్పెషల్ కంటెంట్ ఉంటుంది అని నమ్ముతున్నారు.
అందుకే ఈసారి మరింత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే మేజర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఈ సినిమా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ అందుకుని మంచి సక్సెస్ దక్కడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది.
అందుకే హిట్ 2 సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు అని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరి ఆ వార్తలకు అడవి శేష్ క్లారిటీ ఇచ్చాడు.తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాకి హిందీ రిలీజ్ కూడా ఉంది అని కన్ఫర్మ్ చేసాడు.ఇలా హిందీ రిలీజ్ అని అధికారికంగా చెప్పడంతో అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయం అని అంటున్నారు.
చూడాలి మేజర్ లాగానే ఈ సినిమా కూడా అక్కడ హిట్ అవుతుందో లేదో.డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా నానికి, అడవి శేష్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.







