టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
కాగా ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ.భారీ అంతనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా లైగర్ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చి పెట్టింది.అలాగే ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ను భారీగా దెబ్బతీసింది.
కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఈ సినిమా ఊహించిన విధంగా బొక్క బోర్ల పడింది.
అయితే విజయ్ దేవరకొండ సినిమా డిజాస్టర్ అయ్యింది అని నిరుత్సాహపడకుండా సినిమా విడుదలైన మరుసటి రోజే ఖుషి సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా మారిపోయాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఆ ఫోటోని చూసి విజయ్ దేవరకొండ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించడం మొదలయ్యాయి.

కొన్ని వెబ్సైట్లు విజయ్ దేవరకొండ ఫోటో సలార్ సెట్ లోది అంటూ కొన్ని రకాల కథనాలను ప్రచారం చేశాయి.అంతేకాకుండా విజయ్ సలార్ సినిమాలో ప్రభాస్ కు చిట్టి తమ్ముడు గా నటించబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.ఎందుకంటే గత కొంతకాలంగా విజయ్ థంమ్సప్ బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఆ కొత్త షూట్లో భాగంగా రెండు రోజుల నుంచి విజయ్ అందులో పాల్గొంటున్నాడు.అయితే ఆ యాడ్ ని చేజింగ్ ఫైటింగ్లతో షూట్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన ఫోటో లిక్ అవ్వడంతో ఆ ఫోటోని చూసి చాలామంది సలార్ సెట్ లోది అనుకుంటున్నారు.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు రౌడీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ తగులుకున్నార్రా అంటూ రూమర్స్ క్రియేట్ చేసే వారిపై మండిపడుతున్నారు.








