భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వచ్చే ఏడాదిలో జరగనున్న ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది.కేరళలోని కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఈ మినీ ఆక్షన్ జరగనుంది.
పేరుకే మినీ వేలం అంటున్నారు కానీ ఈ ఆక్షన్‌లో కొందరు ప్లేయర్లను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ కప్పు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఈ జట్టు ఆ ట్రోఫీ గెలవడంలో శామ్ కరన్ కీలక పాత్ర పోషించాడు.బెన్ స్టోక్స్ కూడా అద్భుతంగా ఆడాడు.
కాబట్టి ఈ వేలంలో వారు భారీ ధర పలికే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ కెమరూన్ గ్రీన్‌ను కూడా ఐపీఎల్ మినీ వేలంలోనే కొనుగోలు చేయనున్నారు.ఆల్రెడీ అతని పేరును మినీ ఆక్షన్‌లో రిజస్టర్ చేశారు.టీ20 ఫార్మాట్‌లో సిక్సర్లను అవలీలగా చేస్తూ కెమరూన్ గ్రీన్ బాహుబలి హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో కెమరూన్ అద్భుతంగా ఆడాడు.మూడో టీ20లో కేవలం 19 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అతడిని ఇప్పుడు అన్ని ఫ్రాంఛైజీలు దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాయి.

గ్రీన్ కేవలం మంచి బ్యాటర్ మాత్రమే కాదు గుడ్ బౌలర్ కూడా.అందువల్ల ఈ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు సన్ రైజర్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు.మరి ఏం స్టార్ ప్లేయర్ ను ఎవరు, ఎంత డబ్బు పెట్టి దక్కించుకుంటారో చూడాలి.







