సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, కర్ణాటకతో పాటే ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్న ఆయన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా బీజేపీలోకి రావాలని సూచించారు.