బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 నుంచి తాజాగా రాజశేఖర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.రాజశేఖర్ ఎలిమినేట్ కావడం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.
అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ రాజశేఖర్ కు రెమ్యునరేషన్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
వారానికి కేవలం 20000 రూపాయల చొప్పున రాజశేఖర్ కు రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.
బిగ్ బాస్ షో సీజన్6 లో పాల్గొన్న కంటెంట్లలో అతి తక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ రాజశేఖర్ అని బోగట్టా.ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో రాజశేఖర్ మరికొన్ని రోజుల పాటు ఉండి ఉంటే అతనికి మరింత ఎక్కువ పారితోషికం దక్కి ఉండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ పిచ్చి నిర్ణయాల వల్ల ఫైమాకు బదులుగా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రాజశేఖర్ బిగ్ బాస్ విజేతగా నిలవలేకపోయినా ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
రాజశేఖర్ కు బిగ్ బాస్ షో వల్ల బయట ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.
ఈ షో వల్ల రాజశేఖర్ లైఫ్ మారిపోవడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా రాజశేఖర్ నిర్ణయాలు తీసుకుంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు.
బిగ్ బాస్ షో రాజశేఖర్ కు ఆర్థికంగా కూడా ప్లస్ అయ్యి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోడల్ రాజశేఖర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.