క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందడం కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే క్రీములు, సీరంలు వాడుతుంటారు తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు.ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ వాటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్న గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ ను వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై స్కిన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ రెమెడీని రెండు రోజులకు ఒకసారి కనుక పాటిస్తే చర్మంపై మొటిమలు, మొండి మచ్చలు తొలగిపోతాయి.చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ వదిలి పోతాయి.
చర్మం క్లియర్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.
మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.