Sugar Levels Blood: ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే షుగర్ లెవ‌ల్స్‌ స‌హ‌జంగానే కంట్రోల్ అవుతాయి!

మధుమేహం.ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని సతమతం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి ఏది.

మధుమేహం బారిన పడిన వారు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను గనుక పాటిస్తే చాలా సులభంగా మరియు సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందు రెండు నిమ్మ పండ్లు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన నిమ్మ పండ్ల‌ను సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు నిమ్మ తొక్కల‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ ను పోసుకోవాలి.

Advertisement

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కలు, రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైన‌ర్ స‌హాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలిపి సేవించాలి.

ఈ డ్రింక్ రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజూ తీసుకుంటే క‌నుక‌ రక్తంలోని చక్కర స్థాయిలో సహజంగానే అదుపులోకి వస్తాయి.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకు పోయిన కొవ్వు మొత్తం క్ర‌మంగా క‌రిగిపోతుంది.డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళ‌న‌ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

రోగ నిరోధ‌క‌ వ్యవస్థ సైతం బలపడుతుంది.కాబట్టి మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు