Hyper aadhi soumya rao : ముద్దు పెట్టు అంటూ యాంకర్ పైకి దూసుకెళ్లిన హైపర్ ఆది.. వైరల్ వీడియో?

తెలుగులో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే.ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారంఅవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోంది.

 Hyper Aadhi Harassing New Jabardasth Anchor Soumya Rao Hyper Aadi, Jabardasth, A-TeluguStop.com

ఇకపోతే కమెడియన్లు స్కిట్స్ లో భాగంగా షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై పంచులు వేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా హైపర్ ఆది వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు.

హైపర్ ఆది తన స్కిట్స్ లో యాంకర్లను, జడ్జిలను ఎంట్రీ ఇప్పిస్తూ వారిపై పంచులు వేస్తూ ఉంటాడు.అనసూయతో అయితే ప్రతి స్కిట్ లో కూడా ఎంట్రీ డాన్స్ లు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో హైపర్ ఆది కన్ను కొత్త యాంకర్ ఆయన సౌమ్య రావు పై పడింది.కొత్త యాంకర్ సౌమ్యరావుని బుట్టలో పడేయడానికి హైపర్ ఆది గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

మొదటి ఎపిసోడ్ లోనే సౌమ్యరావు తో కలిసి పులిహార కలపడానికి ప్రయత్నించగా ఆమె నీ డైలాగులకు నేను పడిపోను అంటూ రివర్స్ కౌంటర్ వేసింది.ఆ తర్వాత సమయం దొరికిన ప్రతిసారి కూడా ఆమెతో కలిసి డాన్స్ చేయడానికి మాట్లాడటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు హైపర్ ఆది.అయితే భాష కూడా పెద్దగా రాని ఈ కన్నడ యాంకర్ ఇబ్బందులు పడుతుంటే ఈ క్రమంలోనే హైపర్ ఆది సౌమ్య రావు ను గెలుకుతూ ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.ఆ ప్రోమోలో హైపర్ ఆది, సౌమ్యరావుని ముద్దు అడుగుతూ ఆమె మీద మీదకు వెళ్ళాడు.ఈ క్రమంలోనే సౌమ్యరావు నవ్వుతూనే ముఖమంతా ఒకలాగా పెట్టింది.

జాగా ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్స్ హైపర్ ఆది పై ట్రోల్స్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పంచులు ప్రవర్తన మితిమీరుతున్నాయి అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే చాలు హైపర్ ఆది వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ రెచ్చిపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube