Sudheer Gaalodu Movie: సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా ఓటిటి, శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా?

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం తో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న నటుడు సుడిగాలి సుదీర్.బుల్లితెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుధీర్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Sudigali Sudheer Movie Gaalodu Ott Rights Details, Sudheer , Gaalodu Movie, Gaal-TeluguStop.com

ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు పరవాలేదు అన్నట్లుగానే నిలిచాయి.కానీ మొదటి సారి గాలోడు సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

రెండు కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గాలోడు సినిమా ఏకంగా ఆరు నుండి ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఆ సినిమా మంచి కలెక్షన్స్ దక్కించుకున్న కారణంగా సుధీర్ యొక్క రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచాడు అనేది మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఆ విషయం పక్కన పెడితే గాలోడు సినిమా యొక్క హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది.థియేట్రికల్ రన్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్న ఓటీటీ మరియు శాటిలైట్ వారు అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారట.

ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా గాలోడు సినిమా కు ఏకంగా ఆరు నుండి ఏడు కోట్ల రూపాయలు నిర్మాత కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Gaalodu, Gaalodu Ott, Sudheer, Tollywood-Movie

సినిమా కు పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగా ఈ రెండు రైట్స్ ద్వారానే రాబడంతో సుడిగాలి సుదీర్ యొక్క క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ యొక్క టైం నడుస్తుంది.బుల్లి తెరలతో పాటు వెండి తెర పై కూడా అతడు సూపర్ స్టార్ గా వెలుగు వెలగబోతున్నాడు అంటూ కొందరు నమ్మకం తో ఉన్నారు.

కనుక ఆయన సినిమాలకు ఆ మాత్రం ఖర్చుపెట్టినా కూడా భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది అని ఓటిటి మరియు శాటిలైట్ వారు గాలోడు సినిమా కు అంత రేటు పెట్టేందుకు ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తుంది.నిజంగానే సుడిగాలి సుదీర్ యొక్క సుడి తిరిగినట్లుగా ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేస్తూ స్టార్ హీరో స్థాయికి చేరడం ఖాయం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube