టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబుకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు సినీ కెరియర్లో ఒక్కడు సినిమా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి.
ఇందులో మహేష్ బాబు నటనకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.ఈ సినిమా విడుదల సమయంలో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయింది.
ఇకపోతే ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శ్రీముఖి వ్యాఖ్యతగా జాతి రత్నాలు అనే కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్లు పలు సినిమాలను స్పూఫ్ చేస్తూ సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే నూకరాజు మహేష్ బాబు ఒక్కడు సినిమాని స్పూఫ్ చేసి కామెడీ పండించారు.
ఈ స్కిట్ మొదలైనప్పటి నుంచి మహేష్ బాబు తన చేతి వేళ్లతో ముక్కును తాకుతూ ఉన్న విధంగా స్పూఫ్ చేశారు.
మొన్న క్యాలీఫ్లవర్ చేశాడు సంపూర్ణేష్ బాబు… ఈరోజు నేను మహేష్ బాబు అంటూ డైలాగ్ చెప్పడమే కాకుండా.ఈసారి కబడ్డీ కప్పు కొట్టాలన్నయ్య అంటూ వెటకారంగా డైలాగ్ చెప్పారు.ఈ విధంగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆయన యాక్టింగ్ కూడా చాలా వెటకారంగా చేసి చూపించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కసారిగా నూకరాజుపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
ఉద్దేశపూర్వకంగానే నూకరాజు మహేష్ బాబును కించపరిచేలా తన సినిమా చేశారు అంటూ నూకరాజును తమదైన శైలిలో ట్రోల్ చేస్తూ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.