వేడుక ఏదైనా అందులో డీజే పాటలు పెట్టడం ఇటీవల సాధారణం అయిపోయింది. పెళ్లి వేదికపై వధూవరులు చక్కటి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంటారు.
వారు వేసే స్టెప్పులకు అతిథులంతా మైమరిచిపోయి చూస్తుంటారు.వాటిని వీడియోలుగా తీసి, సోషల్ మీడియాలో పెట్టగానే బాగా వైరల్ అవుతున్నాయి.
భారతీయ పెళ్లి వేడుకలలో మెహందీ ఫంక్షన్లు చాలా చక్కగా జరుగుతున్నాయి.బంధుమిత్రులు, స్నేహితులు మరియు వధూవరులందరూ ఆ ఒక్క రాత్రి కోసం నృత్యాలు ప్రాక్టీస్ చేస్తారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డ్యాన్స్ బాగుండాలని బాగా నేర్చుకుంటారు.ఇదే కోవలో ఓ వధువు చక్కగా ప్రాక్టీస్ చేసి, మెహందీ ఫంక్షన్‌లో అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక దేశీ వధువు తన పెళ్లి రోజున తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసింది.“కాలా చష్మా” పాటకు చక్కని స్టెప్పులు వేసింది.ఈ వీడియోను @newbridedairies అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
కళ్లు చెదిరే లెహంగా ధరించి, కాలా చష్మా పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది.

దీనిని పోస్ట్ చేయగానే దీనికి 1,26,000 కంటే ఎక్కువ సార్లు లైక్‌లు వచ్చాయి.అధిక సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.
పెళ్లికూతురు పెర్ఫార్మెన్స్
చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఆమె పెళ్లి కూతురి డ్రెస్‌లో చాలా అందంగా ఉందని, అంతే చక్కగా డ్యాన్స్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆమెకు వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేశారు.







