Director Pradeep Ranganathan: 'లవ్ టుడే' డైరెక్టర్ కు భారీ డిమాండ్.. అప్పుడే కాకాపట్టడం మొదలెట్టారుగా..

ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్న వారి చెంతకే అదృష్టం కూడా వెళుతుంది.మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో అయితే సక్సెస్ మాత్రమే ముఖ్యం.

 Huge Demand For Director Pradeep Ranganathan Details, Director Pradeep Ranganath-TeluguStop.com

సక్సెస్ ఉంటే వారికీ ఆఫర్ల కొదవే ఉండదు.అది హీరో అయినా.

హీరోయిన్ అయినా.డైరెక్టర్ అయినా.

ఎవ్వరికైనా సక్సెస్ పడితే వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి.ప్రముఖ నిర్మాతలు వారికీ భారీ మొత్తం అడ్వాన్సులు ఇచ్చి మరీ లాక్ చేసుకుంటారు.

ఇక ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.ఆ డైరెక్టర్ మరెవరో కాదు.ప్రదీప్ రంగనాథన్. ఇతడి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది.

ఈ డైరెక్టర్ తీసింది రెండు సినిమాలే అయినా డిమాండ్ బాగా ఏర్పడింది.తమిళ్ లో కోమలి అనే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

జయం రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమా వచ్చిన మూడేళ్ళ తర్వాత ”లవ్ టుడే” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్ టుడే కూడా కోలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.5 కోట్లతో తెరకెక్కగా 70 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Telugu Kollywood, Love, Tamil, Tollywood-Movie

ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో కూడా అదే పేరుతొ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా మాత్రమే కాకుండా కథానాయకుడిగా కూడా నటించాడు.రెండు సినిమాలు మంచి ఇవ్వడంతో అతడికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది.దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట.తెలుగులో దిల్ రాజు కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్.అలాగే ఒక బైలింగ్వన్ సినిమాకు సైన్ చేసినట్టు టాక్.

ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడట.ఇలా కొత్త టాలెంట్ ను ఈ నిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube