Vijay Deverukonda Liger : విజయ్ దేవరకొండకి మిగిలింది ఈ ఒకే ఆప్షనా.. అది కూడా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటో?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Under Gowtam Tinnanuri Direction Vijay Deverakonda Movie , Vijay Devarakonda, Ku-TeluguStop.com

కాగా ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ ఆ సినిమా ఊహించిన విధంగా భారీగా డిజాస్టర్ గా నిలవడంతో తన తదుపరి సినిమా పై దృష్టిని పెట్టాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలావరకు పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.ఆ మధ్య ఒకసారి విజయ్ దేవరకొండకు ముగ్గురు దర్శకులు కలిసి ఒక కథను చెప్పి ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ కాంపిటీషన్ నుంచి ఇప్పుడు ఇద్దరు దర్శకుడు తప్పకుండా వార్తలు వినిపిస్తున్నాయి.ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అన్న విషయానికి వస్తే.

పరశురాం, గౌతమ్ తిన్ననూరి, హరీష్ శంకర్ లు.ఈ ముగ్గురు దర్శకుల పేర్లు ఆమధ్య సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.

వీరిలో దర్శకుడు పరశురాం కు హీరో నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Kushi, Project, Tollywood-Movie

అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కు రీమేక్ సినిమాకు పవన్ ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ ఇద్దరు దర్శకులు ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లే అని తెలుస్తోంది.అయితే ఇక కేవలం మిగిలింది గౌతం తిన్ననూరి మాత్రమే.

ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ విజయ్ కోసం స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో పడ్డారట.విజయ్ దేవరకొండ కోసం గౌతం ప్రత్యేకంగా ఫ్యామిలీ స్టొరీ ని రెడీ చేస్తున్నారట.

కాగా ఈ స్క్రిప్ట్ ఓకే అయితే ఈ సినిమాను సితార సంస్థ నిర్మించనుంది.అయితే మొత్తానికి విజయ్ కు మిగిలిన ఆప్షన్ గౌతం తిన్ననూరి మాత్రమే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube