ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు బీజేపీ నేత బీఎల్ సంతోష్ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సిట్ నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
సిట్ జారీ చేసిన 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులు ఇల్లీగల్ అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ మేరకు సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిల్ లో కోరారు.
అదేవిధంగా నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని క్యాష్ పిటిషన్ వేశారు.కాగా మరికాసేపట్లో బీఎల్ సంతోష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.







