డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా తోడేలు.ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ ద్వారా విడుదల అయ్యింది.
ఇక ఈ సినిమా హిందీలో బేడియా గా రూపొందగా తెలుగులో తోడేలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు.
మామూలుగా కంటెంట్ బాగుంటే మాత్రం ఏ భాషలో సినిమానైనా చూడటానికి సిద్ధంగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.దీంతో ఇక్కడి నిర్మాతలు ఇతర భాషలలో విడుదలైన మంచి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
అయితే ఈ తోడేలు సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా అడవి నేపథ్యంలో రూపొందిగా తెలుగు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే వరుణ్ భాస్కర్ పాత్రలో కనిపించాడు.భాస్కర్ ఓ చిన్నపాటి కాంట్రాక్టర్.
అయితే అతడికి అరుణాచల్ ప్రదేశ్ లో అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కుతుంది.దీంతో భాస్కర్ కు కొన్ని ఆశలు పుడతాయి.
ఈ కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు బాగా సంపాదించి ఇల్లు, కారు కొనాలని బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటాడు.ఇక అలా రోడ్డు నిర్మాణం కోసం తన స్నేహితుల (దీపక్ దోబ్రియా, పాలిన్ బకర్) తో అక్కడికి వెళ్తాడు.
అయితే అక్కడ అడవి మధ్యలో నుంచి రోడ్డు వేయాలని అనుకోవడంతో ప్రాంతపు అధికారులు వద్దు అంటారు.
ఇక కమిషన్ ఏరజుపగా ఆరోజు రాత్రి భాస్కర్ తోడేలు కాటుకు గురవుతాడు.దీంతో అతడు ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారి రోజుకొకరిని చంపి తింటాడు.ఇక అడవిని నాశనం చేయాలనుకున్న వారిని చంపి తింటుంటాడు.
అయితే అతడిని మామూలుగా మనిషి చేయటానికి వెటర్నరీ డాక్టర్ అనిక (కృతి సనన్) చికిత్స చేస్తుంది.ఇక అతడు మామూలు మనిషి అవుతాడా లేదా.
అతడు అలా కావడానికి మరేమైనా కారణాలు ఉన్నాయా.చివరికి అనిక తో తన సంబంధం ఎలా ఉంటుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
వరుణ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే భాస్కర్ పాత్రలో మాత్రం మరింత ఆకట్టుకున్నాడు.తోడేలుగా మారి ఆ పాత్రలు చేసిన ఆయన నటన మరింత బాగుంది.మొత్తానికి ఈ సినిమాను తన భుజాలపై మోసాడు వరుణ్.కృతి సనన్ కూడా డాక్టర్ పాత్రలో బాగా ఆకట్టుకుంది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు మంచి కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.కానీ కొన్ని ఎమోషన్స్ చూపించే విధానంలో కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.
సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ఎడిటింగ్ లో ఇంకాస్త మార్పులు చేస్తే బాగుండేవి.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ:
అడవి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ రొటీన్ కథ కాకుండా కాస్త కొత్తగా పరిచయం చేశాడు.హీరో తోడేలుగా మారటం తీరు మాత్రం అద్భుతంగా ఉంది.ముఖ్యంగా అడవులను కాపాడే కాన్సెప్ట్ తో బాగా చూపించాడు డైరెక్టర్.అంటే తోడేలు అడవిని కాపాడుకోవడం కోసం అలా చేస్తుందని చూపించాడు డైరెక్టర్.చాలా వరకి కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా హైలైట్ గా నిలిచాయి.చివర్లో ట్విస్టు కూడా చాలా అద్భుతంగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, కామెడీ, సంగీతం.
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఇది ఒక ప్రయోగాత్మక సినిమా అని చెప్పవచ్చు.