Cristiano Ronaldo Rafael Leo : రొనాల్డో అరుదైన రికార్డు... 5 ప్రపంచ కప్‌లలో గోల్ కొట్టిన మొనగాడు!

ఫిఫా వరల్డ్‌ కప్‌లో అద్భుతాలు చోటు చేసుకుంతున్నాయి.తాజాగా స్టార్ట్ అయిన ఈ వరల్డ్‌ కప్‌లో పోర్చుగల్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చింది.

 Ronaldo's Rare Record He Scored A Goal In 5 World Cups , Ronald , Rare Record,-TeluguStop.com

గ్రూప్‌ – Hలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఘనాపై పోర్చుగల్‌ విజయ దుందుభి మోగించింది.ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో 3-2తో పోర్చుగల్‌ గెలిచింది.

పోర్చుగల్ ఆటగాళ్లు అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో, రాఫెల్‌ లియో, ఫెలిక్స్‌లు ఒక్కో గోల్ చేశారు.అలాగే ఘనా తరఫున ఆండ్రెస్‌ అయూ, బుకారి గోల్స్‌ సాధించారు.

ఇక ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డ్ గోల్ చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి.దాంతో 5 ఫిఫా ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన మొదటి ఆటగాడిగా రొనాల్డో ప్రపంచ రికార్డ్ సాధించాడు.

ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం కొసమెరుపు.అయితే సెకండాఫ్‌లో మాత్రం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.ఈ క్రమంలో 63వ నిమిషంలో పెనాల్టీ రూపంలో పోర్చుగల్‌కు అదృష్టం కలసి వచ్చిందనే చెప్పాలి.అయితే దీన్ని క్రిస్టియానో రొనాల్డో బాగా వాడుకున్నాడు.

వెంటనే గోల్‌ చేసి పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యం అందించాడు.ఇక 74వ నిమిషంలో ఘనా ఆటగాడు ఆండ్రెస్‌ అయూ గోల్ చేయడంతో స్కోరు సమం అయింది.

అనంతరం రొనాల్డో సేన రెండు నిమిషాల తేడాతో రెండు గోల్స్‌ చేయడంతో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Telugu Latest, Rare, Ronald, Cup-Latest News - Telugu

ఆ తరువాత 89వ నిమిషంలో ఘనా ఆటగాడు ఒస్మాన్‌ బుకారి హెడర్‌తో గోల్‌ చేయడంతో జట్టు ఖాతాలో 2 గోల్స్ వచ్చి పడ్డాయి.ఇకపోతే మ్యాచ్ చివరి వరకూ ఘనా మరో గోల్ చేయలేకపోవడంతో 3-2తో పోర్చుగల్ ఘన విజయం సాధించింది.ఈ క్రమంలో తాను ఆడిన 5 వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డు సెట్ చేసాడు.

ఇంతకుముందు క్లోజ్‌, సీలర్‌, పీలే, మెస్సీలు 4 వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేయగా ఇపుడు ఇతను వాళ్ళని అధిగమించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube