Milk Winter Season: చలి కాలంలో పాలు డైరెక్ట్ గా కాదు ఇలా తాగితే మీ ఆరోగ్యం పదిలం!

పాలు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు వీటిని వాడుతూనే ఉంటారు.

 Drinking Milk Like This During Winter Season Is Very Good For Health! Milk, Wint-TeluguStop.com

పాలు చక్కటి రుచితో పాటు ఎన్నో అమోఘమైన పోషక విలువలు కలిగి ఉంటాయి.అందుకే పాలు సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తుంటారు.

రోజుకు ఒక గ్లాసు పాలు తీసుకుంటే వివిధ రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ఇది అక్షరాల సత్యం.

అయితే ప్రస్తుత చలికాలంలో మాత్రం పాలు డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలం.మరి ఇంకెందుకు ఆలస్యం వింటర్ సీజన్ లో పాలను ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం పదండి.

సాధార‌ణంగా చాలా మందికి ఉదయం పాలు తాగే అలవాటు ఉంటుంది.అయితే చలికాలంలో మాత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఆఫ్‌ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ ఖర్జూరం పేస్ట్ వేసుకుని బాగా కలిపి సేవించాలి.

ఈ విధంగా పాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో జలుబు, దగ్గు తదితర సీజ‌న‌ల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఒకవేళ ఉన్నా తగ్గుముఖం పడతాయి.అలాగే పాలల్లో దాల్చిన చెక్క, ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల నీరసం, అలసట పరార్ అవుతాయి.

బాడీ ఎన‌ర్జిటిక్ గా మారుతుంది.చలికాలంలో వేధించే బద్ధకం నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Telugu Milk, Tips, Milk Benefits, Season-Latest News - Telugu

ఇక కొందరు రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు.అయితే రాత్రి సమయంలో పాలు తీసుకునేటప్పుడు అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం తురుము మిక్స్ చేసి సేవించాలి. చలికాలంలో రాత్రివేళ ఈ విధంగా పాలు తీసుకుంటే చక్కటి నిద్ర పడుతుంది.చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి సైతం లభిస్తుంది.కాబట్టి చలికాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా పాలను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube